News April 25, 2024
పులివెందులలో 37, కుప్పంలో 32 నామినేషన్లు

AP: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగియగా.. జగన్ పోటీ చేసే పులివెందుల నుంచి 37 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ వివేకా హత్యలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సైతం జగన్‌పై పోటీ చేస్తున్నారు. చంద్రబాబు బరిలో ఉన్న కుప్పంలో 32, పవన్ పిఠాపురంలో 19, లోకేశ్ మంగళగిరిలో 65, బాలకృష్ణ హిందూపురంలో 19, షర్మిల పోటీ చేస్తున్న కడపలో 42 నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News January 27, 2026
అతి త్వరలో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల!

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల కానుంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా… అడ్మినిస్ట్రేషన్ కారణాలతో ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం మే 24న ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsc.gov.in/
News January 27, 2026
ఈయూతో డీల్.. వీటి ధరలు తగ్గుతాయి

ఇండియా-EU మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ <<18971975>>కుదిరిన<<>> విషయం తెలిసిందే. దీంతో EU దేశాల నుంచి వచ్చే 96.6% వస్తువులపై సుంకాలు ఉండవు/తగ్గుతాయి. పలు కార్లు, ఆలివ్ ఆయిల్, కివీస్, స్పిరిట్స్ (విస్కీ, వోడ్కా వంటివి), బీర్, వైన్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ ధరలు దిగొస్తాయి. ఈ డీల్‌తో 90%పైగా భారత ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లో సుంకాలు ఉండవని తెలుస్తోంది. టెక్స్‌టైల్స్, కెమికల్స్, జువెలరీ రంగాలకు సపోర్ట్ దక్కనుంది.
News January 27, 2026
డీసీసీబీల్లోనూ యూపీఐ సేవలు

AP: రాష్ట్రంలోని అన్ని డీసీసీబీల్లో త్వరలోనే UPI సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో నిన్న ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ బ్యాంకుల్లో ఎక్కువగా ఖాతాలు కలిగిన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కాగా ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల్లోనే ఈ సేవలు ఉన్న విషయం తెలిసిందే.


