News May 6, 2024

3,712 ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపు లాస్ట్ డేట్

image

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 SSC CHSL(10+2) ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే మే 10, 11 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్/జూ.సెక్రటేరియట్ అసిస్టెంట్, DEO, పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 18-27 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులు(రిజర్వేషన్‌ను బట్టి సడలింపు). పూర్తి వివరాల కోసం <>https://ssc.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

Similar News

News February 4, 2026

వాట్సాప్‌పై సుప్రీం ఆగ్రహం.. అసలు ఏం జరిగింది?

image

వాట్సాప్‌కు <<19037669>>సుప్రీంకోర్టు<<>> గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 2021లో వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల డేటాను మెటాలోని ఇతర కంపెనీలతో షేర్ చేసుకుంటామని చెప్పింది. దీనికి అంగీకరిస్తేనే వాట్సాప్ వాడుకోనిస్తాం, లేదంటే అకౌంట్ డిలీట్ చేసుకోండని కండిషన్ పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు..‘భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి’ అని హెచ్చరించింది.

News February 4, 2026

ఫిబ్రవరి 04: చరిత్రలో ఈరోజు

image

☛ 1891: స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం
☛ 1962: సినీ నటుడు రాజశేఖర్ జననం
☛ 1972: దర్శకుడు శేఖర్ కమ్ముల జననం
☛ 1974: సినీ నటి, పొలిటీషియన్ ఊర్మిళ జననం
☛ 2023: సింగర్ వాణి జయరాం మరణం(ఫొటోలో)
☛ వరల్డ్ క్యాన్సర్ డే
☛ శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం

News February 4, 2026

స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: చంద్రబాబు

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్లాంట్ పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త విధానాలతో అన్ని విభాగాల్లో కర్మాగారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మరోవైపు 2024 సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి.. 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని స్టీల్ ప్లాంట్ సాధించింది.