News October 17, 2024
375 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు : కలెక్టర్
నల్గొండ జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 375 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, వారం చివరి వరకు అన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, లారీలు, హమాలీల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News November 8, 2024
NLG: సీఎం రేవంత్ రెడ్డి నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..!
> ఉ.9 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరుతారు.
> ఉ.9.20కి యాదాద్రి చేరుకుంటారు.
> ఉ.10.05 నుంచి ఉ.11.15 వరకు యాదగిరిగుట్టలో స్వామి దర్శనం
> ఉ.11.30 నుంచి మ.1 గంట వరకు YTDA, ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష.. అనంతరం మల్లన్నసాగర్-యాదాద్రి మిషన్ భగీరథ పైపులైన్‌కు శంకుస్థాపన
> మ.1-1.30 వరకు లంచ్ బ్రేక్.. మ.2.10-3 వరకు సంగెం-భీమలింగం వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర
News November 8, 2024
NLG: సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్
మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్‌లో గురువారం కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరికీ సమాచారాన్ని వెల్లడించేది కాదని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు.
News November 8, 2024
NLG: నేడు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర
సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి- భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సంగెం నుంచి భీమలింగం వరకు 2.5 కి.మీ మేర మూసీ పునరుజ్జీవ సంకల్ప పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.