News February 15, 2026

38 దేశాలతో ట్రేడ్ డీల్స్.. MSMEల మార్కెట్ విస్తరించింది: మోదీ

image

దేశంలో రాజకీయ స్థిరత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచిందని PM మోదీ చెప్పారు. కొన్నేళ్లుగా 38 దేశాలతో 9 ట్రేడ్ డీల్స్ చేసుకున్నట్లు తెలిపారు. టెక్స్‌టైల్స్, లెదర్, కెమికల్స్, హ్యాండ్‌క్రాఫ్ట్స్, జువెల్లరీ వంటి రంగాల్లో MSMEల మార్కెట్ విస్తరించిందన్నారు. ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. UPA హయాంలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక ఏ దేశంతోనూ చర్చించలేకపోయిందని విమర్శించారు.

Similar News

News February 16, 2026

బిల్‌గేట్స్.. అమరావతికి ఆహ్వానం(PHOTOS)

image

AP: మైక్రోసాఫ్ట్ ఫౌండర్, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు నారా లోకేశ్ సహా మంత్రులంతా ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని వెల్కమ్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పైన గ్యాలరీలో చూడవచ్చు.

News February 16, 2026

జొన్నలో కాండం తొలుచు పురుగు.. నివారణ

image

జొన్న పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి. * కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. * పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.

News February 16, 2026

జగిత్యాలలో కాంగ్రెస్ Vs కాంగ్రెస్.. జీవన్ రెడ్డికి ఎదురుదెబ్బ!

image

TG: జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ MLA సంజయ్-జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తోంది. తమకే ఛైర్మన్ పీఠం కావాలంటే తమకే కావాలంటూ CONG అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంజయ్ క్యాంపునకు చెందిన వాణికి ఛైర్‌పర్సన్ పదవి దక్కినట్లు సమాచారం. మార్కెట్ కమిటీ పదవుల్లో అవకాశం ఇస్తామని జీవన్ రెడ్డికి నచ్చజెప్పారట. కాసేపట్లో క్లారిటీ రానుంది.