News July 11, 2024
యూపీలో పిడుగుపాటుకు 38 మంది మృతి

యూపీలో ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో పిడుగుల ధాటికి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రతాప్గఢ్ జిల్లాలో 11 మంది, సుల్తాన్పూర్లో 7, చందౌలీలో 6, మైన్పురీలో 5, ప్రయాగ్రాజ్లో నలుగురు మృతి చెందారు. కాగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News November 9, 2025
ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద అప్టేట్

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.


