News June 24, 2024
ఒకే ఓవర్లో 38 పరుగులు

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో వార్సెస్టర్‌షైర్(WOR) ప్లేయర్ డాన్ లారెన్స్ రెచ్చిపోయారు. సర్రేతో జరుగుతున్న మ్యాచులో ఇన్నింగ్స్ 128వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో 5 సిక్సర్లు బాదారు. ఈ ఓవర్లో ఎక్స్‌ట్రాలతో కలుపుకుని ఏకంగా 38 పరుగులు వచ్చాయి. లారెన్స్ 223 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేశారు. కాగా WOR తొలి ఇన్నింగ్సులో 490 పరుగులు చేయగా సర్రే 4 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.
Similar News
News April 9, 2026
ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?

నిజంగా ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం ఇస్తే ఎంత బాగుంటుందో కదా! స్పెయిన్‌లోని అరెనిల్లాస్ అనే గ్రామం ఫ్యామిలీస్‌కు ఈ ఆఫర్ ఇస్తోంది. అయితే స్కూలుకు వెళ్లే పిల్లలు ఉండాలని, శాశ్వతంగా అక్కడే నివసించాలని, విలేజ్ బార్ నడపాలని, మున్సిపల్ పని చేయాలని కండిషన్లు పెడుతోంది. ప్రస్తుతం అక్కడ 40 మందే ఉండటంతో జనాభా పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ప్రకటన చేయగానే 100 దరఖాస్తులు వచ్చాయట.
News April 9, 2026
రాజ్ లేకుండా ఒక్క రోజూ ఉండలేను.. సమంత ఎమోషనల్

తన భర్త రాజ్ గురించి చెబుతూ హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ‘నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. తర్వాత నేను ఒక బెటర్ పర్సన్‌గా, బెటర్ యాక్ట్రెస్‌గా కావడానికి భర్త రాజ్ కారణం. మేం కలిసే వర్క్, వర్కవుట్స్ చేస్తాం. గేమ్స్ ఆడతాం. ఆయనను విడిచి నేను ఒక్క రోజు కూడా ఉండలేను’ అని పేర్కొన్నారు. కాగా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మే 15న విడుదల కానుంది.
News April 9, 2026
పాస్ పుస్తకాల్లో కరెన్సీకి వాడే టెక్నాలజీ: సీఎం

AP: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, అది జీవనాధారం, భద్రత, గౌరవమని CM CBN చెప్పారు. YCP హయాంలో ప్రజల భూమిపై కన్నేశారని ఆరోపించారు. బాపట్ల(D) సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ సభలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే 21.23L కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చాం. జులై నాటికి మరో 9 లక్షలు, 2027 మార్చికి 80 లక్షల పాస్ బుక్స్ అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీ ఇందులో వాడుతున్నాం. వీటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరు’ అని చెప్పారు.


