News April 25, 2024
39 మంది అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

నంద్యాల ఎంపీ స్థానానికి మంగళవారం నలుగురు, అసెంబ్లీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు నలుగురు, ఆళ్లగడ్డకు ఆరుగురు, శ్రీశైలానికి ఆరుగురు, నందికొట్కూరుకు నలుగురు, నంద్యాలకు 11 మంది, బనగానపల్లెకు ఆరుగురు, డోన్‌కు ఇద్దరు దాఖలు చేశారన్నారు.
Similar News
News November 16, 2025
ఆదోని జిల్లా సాధించి తీరుతా: ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ఆదోని జిల్లాను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హామీపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News November 16, 2025
సివిల్స్‌కు ఉచిత కోచింగ.. దరఖాస్తుల ఆహ్వానం

డా. బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2026, మెయిన్స్‌కు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అర్హులని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 340 సీట్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులు నవంబర్ 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 16, 2025
కర్నూలు: రేపు ‘డయల్ యువర్ APSPDCL CMD’

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ APSPDCL CMD’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం సహా తొమ్మిది జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.


