News August 25, 2025
39 మంది కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు.. సీపీ అభినందన

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 39 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొందారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా వారికి ఉద్యోగోన్నతుల చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, సేవాస్ఫూర్తికి గుర్తింపుగా ఈ పదోన్నతి లభించిందని అన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News August 25, 2025
కేంద్రంతో కోట్లాడి యూరియాను తీసుకొచ్చాం: మంత్రి తుమ్మల

యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై కోట్లాడి35 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు తరలించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు.
News August 25, 2025
ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తమ పరిధిలో చేయగలిగిన పనిని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో దానికి గల కారణాలను, నిబంధనలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని అధికారులను సూచించారు.
News August 25, 2025
ఖమ్మం Dy. కమిషనర్‌గా శ్రీనివాసరావు

ఖమ్మం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా K. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్‌కు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.