News October 27, 2024

39 మంది కానిస్టేబుళ్లపై వేటు

image

TG: కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలకు ప్రేరేపిస్తున్న 39 మందిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

Similar News

News January 31, 2026

ఉల్లితో చర్మానికి ఆరోగ్యం

image

ఇంట్లోని ఉల్లిపాయని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఉల్లిలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చర్మ సమస్యలను నివారిస్తాయి. మచ్చలను తొలగిస్తాయి. ఉల్లిపాయ నుంచి తీసిన రసంలో ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే ముఖం మెరుస్తుంది. అంతేకాదు పిగ్మెంటేషన్‌ను కూడా ఉల్లిపాయ చక్కగా పోగొడుతుంది. శెనగపిండిలో ఉల్లిరసం, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం తేటగా అవుతుంది.

News January 31, 2026

నేడు శని త్రయోదశి! ఏం చేయాలంటే..?

image

శనిదోష నివారణకు ఎంతో అనుకూలమైన రోజు శని త్రయోదశి. అరుదైన ఈ పుణ్యకాలంలో చేసే పూజలకు అధిక శక్తి ఉంటుంది. నేడు పాటించే కొన్ని పరిహారాలు దోష విముక్తి కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. శనైశ్చరుడుకి తైలాభిషేకం చేయాలంటున్నారు. నల్ల నువ్వులు, వస్త్రాలు దానం చేయడం, కాకులు, శునకాలకు ఆహారం పెట్టడం వల్ల విశేష ఫలితాలుంటాయని సూచిస్తున్నారు. ఈ పుణ్య దినాన పాటించాల్సిన నియమాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News January 31, 2026

₹70,000 కోట్లకు చేరిన భారత స్పేస్ ఎకానమీ

image

భారత స్పేస్ ఎకానమీ ₹70,000Crకు చేరిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. ఇస్రో ఇప్పటివరకు 434 ఫారిన్ శాటిలైట్లను లాంచ్ చేసిందని, వాటి ద్వారా ₹4,800Cr ఆర్జించినట్లు తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో ప్రైవేటు కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్ పెరిగిందని, ప్రస్తుతం 399 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయన్నారు. రాబోయే 8-10 ఏళ్లలో ఈ రంగం 4-5 రెట్లు వృద్ధి చెంది ₹3.3-3.7లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు.