News August 13, 2025

విజయవాడలో 39 పునరావాస కేంద్రాల ఏర్పాటు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కృష్ణానది, బుడమేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని ప్రజలకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Similar News

News August 13, 2025

‘ఫస్ట్ డే’ కంటే జీవితం ముఖ్యం మిత్రమా!

image

రేపు NTR-హృతిక్ రోషన్ ‘వార్ 2’, రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ కానున్నాయి. టికెట్లు సైతం భారీగా బుక్ అయ్యాయి. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. సినిమా ఫస్ట్ డే కాకపోతే మరునాడైనా చూడొచ్చు. అంతేగానీ థియేటర్ల వద్ద ఎగబడి ప్రాణాల మీదకు తెచ్చుకోకపోవడం మంచిది. మీరేమంటారు?

News August 13, 2025

నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఆగస్టు 27 వరకు పొడిగించారు. ఇవాళ్టితో గడువు ముగియనుండగా దాన్ని పెంచారు. ప్రస్తుతం 5వ క్లాస్ చదువుతున్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. APలో 15, TGలో 9 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. DEC 13న పరీక్ష నిర్వహిస్తారు. 2026 మార్చిలో ఫలితాలను వెల్లడిస్తారు. దరఖాస్తు చేసేందుకు <>క్లిక్ <<>>చేయండి.

News August 13, 2025

చర్చలు విఫలం.. కొనసాగనున్న సినీ కార్మికుల సమ్మె

image

సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో కార్మికుల సమ్మె కొనసాగనుంది. ‘షరతులతో కూడిన పని విధానాలకు కార్మికులు ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. రూ.2,000 కంటే తక్కువ తీసుకునే వారికి ఒక విధానం, అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరో విధానాన్ని ప్రతిపాదించాం. మరో 2, 3 సార్లు చర్చలు జరగాల్సి ఉంది’ అని దిల్ రాజు తెలిపారు.