News December 11, 2025
394 పోస్టులకు UPSC నోటిఫికేషన్

UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్(MPC) ఉత్తీర్ణులైనవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: https://upsc.gov.in/
Similar News
News December 15, 2025
‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?

సాధారణంగా ప్రసవం తర్వాత కొందరు మహిళలు మతిమరుపునకు లోనవుతుంటారు. దీన్నే”మామ్స్ బ్రెయిన్” అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. డెలివరీ తర్వాత బిడ్డ సంరక్షణలో పడి పోషకాహారం తీసుకోవడం మానేస్తారు. బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల బాలింతలు ఆరోగ్యంగా ఉండి మతిమరుపు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
News December 15, 2025
పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అంటూనే భార్యలు గెలిస్తే భర్తలు రూల్ చేయడం సాధారణమైపోయింది. పేరు మహిళలదే అయినప్పటికీ పెత్తనం మాత్రం పురుషులు చెలాయిస్తున్నారు. చాలా చోట్ల వారిని రబ్బరు స్టాంపుగానే చూస్తున్నారు. ఇదే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఈ నెల 22లోపు నివేదికలు ఇవ్వాలని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది.
News December 15, 2025
దేశానికి త్వరలో కొత్త ప్రధాని: పృథ్వీరాజ్

మహారాష్ట్ర మాజీ సీఎం, INC నేత పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి త్వరలో కొత్త PM రాబోతున్నారని జోస్యం చెప్పారు. ఆయన మరాఠీ వ్యక్తే కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల SMలో తాను చేసిన పోస్టుపై స్పందిస్తూ ‘ప్రపంచ స్థాయిలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మార్పులు జరగొచ్చు. బీజేపీ మహారాష్ట్ర నుంచి కొత్త వ్యక్తికి ప్రధానిగా అవకాశం ఇవ్వొచ్చు. నా ప్రకటన ఊహాజనితమే’ అని పేర్కొన్నారు.


