News August 23, 2025

ఐబీలో 394 జాబ్స్.. జీతం రూ.81వేలు

image

394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఇంటెలిజెన్స్ బ్యూరో నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్లికేషన్లకు సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించింది. డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. SHARE IT.

Similar News

News August 24, 2025

గర్భంతో ఉన్న సమయంలో పారాసిటమాల్ వాడుతున్నారా?

image

మహిళలు గర్భంతో ఉన్న సమయంలో పారాసిటమాల్ వాడితే పుట్టే బిడ్డలపై ప్రభావం చూపిస్తాయని హర్వర్డ్ పరిశోధకులు తెలిపారు. ఈ పెయిన్ కిల్లర్‌ను అతిగా వాడితే జన్యు పరమైన సమస్యలతో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. ఈ మెడిసిన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని అధ్యయనం సూచించింది. అయితే డాక్టర్ల సూచన లేకుండా ఒక్కసారిగా మెడిసిన్ తీసుకోవడమూ ఆపకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

News August 24, 2025

కూలీ, వార్-2 కలెక్షన్లు ఎంతంటే?

image

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 74% రికవరీ చేసిందని, మరో రూ.80 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నాయి. మరోవైపు NTR, హృతిక్ నటించిన ‘వార్-2’ వరల్డ్ వైడ్‌గా రూ.314 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

News August 24, 2025

100 దేశాలకు భారత్‌ నుంచి EVల ఎగుమతి: మోదీ

image

100 దేశాలకు EVలు ఎగుమతి చేసిన అరుదైన మైలురాయిని భారత్ అందుకోనుందని వరల్డ్ లీడర్ ఫోరమ్‌లో PM మోదీ అన్నారు. 2014 వరకు ఏటా ఆటోమొబైల్ ఎగుమతుల విలువ రూ.50వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు మెట్రో కోచ్‌లు, రైల్ కోచ్‌లు, లోకోమోటివ్స్ ఎగుమతిని ప్రారంభించిందని పేర్కొన్నారు. 100దేశాలకు ఎగుమతుల మైలురాయికి గుర్తుగా ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.