News August 30, 2025

డిగ్రీ అర్హతతో ఐబీలో 394 జాబ్స్

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు <>www.mha.gov.in<<>> వెబ్‌సైటును సంప్రదించగలరు.

Similar News

News February 3, 2026

ఇండియన్ టెక్నాలజీతోనే హైస్పీడ్ రైళ్లు: నిర్మలా సీతారామన్

image

దేశంలో రాబోయే హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ పూర్తిగా దేశీయ టెక్నాలజీతోనే సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ బుల్లెట్ తరహా రైళ్లు ఇండియన్ టెక్నాలజీతో, మేడ్ ఇన్ ఇండియా కోచ్‌లతోనే పట్టాలెక్కుతాయని బడ్జెట్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబై-పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై సహా మొత్తం 7 కారిడార్లను బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

News February 3, 2026

బలహీన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్‌లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్‌లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.

News February 3, 2026

ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు

image

☛ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్‌బర్గ్ మరణం
☛ 1924: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.
☛ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
☛ 1963: RBI 23వ గవర్నర్‌ రఘురాం రాజన్ జననం
☛ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
☛ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం