News November 16, 2025

3Dలోనూ అఖండ-2

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 4, 2026

బిహార్ సీఎంగా బీజేపీ నేత?

image

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.

News March 4, 2026

అరుదైన రికార్డుకు వికెట్‌ దూరంలో బుమ్రా

image

రేపు T20 WCలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచులో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే ఓవరాల్‌గా 500 వికెట్ల క్లబ్‌లో చేరనున్నారు. దీంతో ఈ రికార్డ్ సృష్టించిన 8వ భారత బౌలర్‌గా నిలుస్తారు. ఇప్పటివరకు Tests 234, ODIs 149, T20 116 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో కుంబ్లే(956) అత్యధిక వికెట్ టేకర్‌ కాగా తర్వాతి స్థానాల్లో అశ్విన్(765), హర్భజన్(717), కపిల్‌(687), జడేజా(634), జహీర్ ఖాన్(610), శ్రీనాథ్(551) ఉన్నారు.

News March 4, 2026

యుద్ధం.. 1,097 మంది ఇరానియన్లు మృతి

image

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 1,097 మంది పౌరులు చనిపోయినట్లు USకు చెందిన హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. వీరిలో 10 ఏళ్లలోపు పిల్లలు 181 మంది ఉన్నట్లు తెలిపింది. లెక్కలోకి రాని మృతులు, గాయపడిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుందని పేర్కొంది. కాగా ఇరాన్‌లోని కీలక స్థావరాలపై US అటాక్ చేస్తుండగా, ఇజ్రాయెల్‌తోపాటు ఇరాక్, కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తోంది.