News May 13, 2024
@3PM వరంగల్ ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ 54.17%
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-58.00%, స్టే.ఘ-63.51%, పాలకుర్తి- 60.22%, పరకాల-57.48%, వర్ధన్నపేట-56.40%, వరంగల్ ఈస్ట్-47.10%, వరంగల్ వెస్ట్-38.27%గా ఉన్నాయి.
Similar News
News January 22, 2025
కొత్తగూడ: కొడుకు దశదిన కర్మ రోజే తల్లి మృతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బూర్గుంపులో విషాదం నెలకొంది. కొడుకు చనిపోయిన రోజుల వ్యవధిలోనే తల్లి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గట్టి నరేశ్ అనారోగ్యంతో పది రోజుల కిందట మృతి చెందాడు. ఆయన తల్లి యాకమ్మ కొన్ని రోజులుగా పక్షవాతంతో మంచాన పడింది. కొడుకు మృతితో మనస్తాపం చెందిన యాకమ్మ.. ఆయన దశదిన కర్మ రోజే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News January 22, 2025
మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ
మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పోకడలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో పాటు పిరమిడ్ లాంటి స్కీంల ద్వారా ప్రజల సొమ్ము దోచేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News January 21, 2025
నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటానికి జిల్లా కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఔత్సాహిక మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.