News November 27, 2024
గుకేశ్ ఖాతాలో 3వ విజయం
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 3వ రౌండ్లో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో గెలుపొందడం గమనార్హం. మొత్తం 14 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్నవారు విజేతవుతారు. ఈ టోర్నీ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్(18) చరిత్ర సృష్టిస్తారు.
Similar News
News November 28, 2024
నాకు పంజాబ్ కంటే ఆర్సీబీయే బెటర్: లివింగ్‌స్టోన్
IPL వేలంలో తనను ఆర్సీబీ తీసుకోవడం పట్ల ఇంగ్లండ్ ఆటగాడు లివింగ్‌స్టోన్ హర్షం వ్యక్తం చేశారు. ‘బెంగళూరు ఫ్యాన్స్ చాలా అభిమానం చూపిస్తారు. అక్కడి స్టేడియం కూడా చిన్నది. నా ఆటతీరుకు పంజాబ్ కంటే ఆర్సీబీయే కరెక్ట్‌గా ఉంటుంది. మా జట్టు వేలం చాలా బాగా జరిగింది. మంచి ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వారిలో కొంతమంది నాకు సన్నిహితులే. విరాట్‌తో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.
News November 28, 2024
బాధ్యతలు చేపట్టిన స్మితా సభర్వాల్
TG: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 12న ఆమెకు ఈ పోస్టింగ్ కల్పించారు. కానీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా ఇప్పటివరకు స్మిత అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు.
News November 28, 2024
280 కి.మీ వేగంతో వెళ్లేలా హైస్పీడ్ రైళ్లు
దేశంలో హైస్పీడ్ రైళ్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు 280 కి.మీ వేగంతో ప్రయాణించేలా BEMLతో కలిసి చెన్నై ICFలో వీటిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఒక్కో కోచ్ తయారీకి రూ.28 కోట్లు ఖర్చవుతుందని, ఇతర రైళ్ల బోగీలతో పోలిస్తే తయారీ ఖర్చు ఎక్కువన్నారు. ఆటోమేటిక్ డోర్స్, CCTV, మొబైల్ ఛార్జింగ్, ఫైర్ సేఫ్టీ సహా మరికొన్ని ఆధునాతన ఫీచర్లు ఈ రైళ్లల్లో ఉంటాయన్నారు.