News November 3, 2025
4న ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో ఈనెల 4న ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్స్ ఖోఖో జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఎంపికైన ఉమ్మడి జిల్లా మహిళ, పురుషుల జట్లు 7న పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు. వివరాలకు 99637 70406, 95538 10943 సంప్రదించాలన్నారు.
Similar News
News November 3, 2025
భద్రాచలం: ‘మా ప్రాంతంలో మద్యం, బెల్టు షాపులు వద్దు’

భద్రాచలం టౌన్ ఐటీడీఏకు ఎదురుగా ఉన్న వైఎస్‌ఆర్ నగర్‌లో వినూత్న రీతిలో ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేయొద్దని కాలనీ వాసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పాఠశాల, దేవాలయం, మ్యూజియం వంటి ప్రధానమైన స్థలాలు ఉన్నాయని తెలిపారు. పర్యాటకులు తరచుగా వచ్చే ప్రాంతంలో మద్యం దుకాణాలను అనుమతించవద్దని కోరుతున్నారు.
News November 3, 2025
విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర <<18183462>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురి పెళ్లి కోసం ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.
News November 3, 2025
కస్టమర్‌తో ర్యాపిడో రైడర్ అసభ్య ప్రవర్తన

AP: కస్టమర్‌తో ర్యాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 12.30am బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుంది. గమ్యం చేరాక రైడర్(పెద్దయ్య) ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త ర్యాపిడో రైడర్‌ను పట్టుకున్నారు. నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు రాగా వారికి అప్పగించడంతో కేసు నమోదు చేశారు.


