News September 10, 2025

4వేల ఎకరాలు గుర్తించండి: కలెక్టర్

image

రంపచోడవరం PMRC కార్యాలయంలో తహశీల్దార్‌లతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు వలన చింతూరు డివిజన్‌లో భూములు కోల్పోతున్న రైతులకు అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో భూములు అందజేయాలన్నారు. కేసుల్లో లేని, వివాదాలు లేని 4,000 ఎకరాలను గుర్తించి నివేదిక 15రోజుల్లో అందజేయాలని తహశీల్దార్‌లను ఆదేశించారు. సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ఉన్నారు.

Similar News

News September 10, 2025

జాడలేని పులస.. విలసలకు డిమాండ్

image

కోనసీమ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేవి పులస చేపలు. వరదల సమయంలో సముద్రం నుంచి సంతానోత్పత్తికి గోదావరి నదిలోకి వచ్చే పులస జాడ లేక పోవడంతో మాంస ప్రియులు ఈ ఏడాది తీవ్ర నిరాశ చెందారు. దీంతో పులసను పోలి ఉండే విలసలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సముద్రంలో దొరికే విలసలను ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కేజీ రూ.700 నుంచి రూ.1500 పలుకుతోంది. పులస లేని లోటును విలసలతో తీర్చుకుంటున్నారు.

News September 10, 2025

వీటిని రోజూ వాడుతున్నారా?

image

అమ్మాయిలు ఎన్నో బ్యూటీప్రోడక్ట్స్ వాడతారు. వాటిలో కొన్నిటిని రోజూ వాడితే ఇబ్బందులొస్తాయంటున్నారు నిపుణులు. వాటర్‌ప్రూఫ్ మస్కారా రోజూ వాడితే కనురెప్పలు పొడిబారిపోతాయి. చర్మాన్ని వారానికి రెండుసార్లే స్క్రబ్ చెయ్యాలి. లేదంటే పొడిబారి నిర్జీవంగా మారుతుంది. డీప్ కండీషనర్స్‌ రోజూ వాడితే కేశాల్లోని పీహెచ్ స్థాయులపై ప్రభావం చూపి నిర్జీవంగా మారుస్తుంది. కాబట్టి వీటిని పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.

News September 10, 2025

కాసేపట్లో వర్షం

image

TG: కాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వానలు పడతాయని అంచనా వేసింది.