News April 12, 2025
‘4వ స్థానంలో జనగామ జిల్లా’

ఉపాధిహామీ పనుల్లో జనగామ జిల్లా 4వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద భూగర్భ జలాలను పెంపోందించేందుకు వాటర్ షెడ్ పనులను చేపట్టామన్నారు. జనగామ పట్టణానికి 760 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. గ్రామీణంలో 3633 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు.
Similar News
News November 5, 2025
గిరిజనుల సమస్యలపై కలెక్టర్ సమీక్ష

కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు, డి.వి.సత్రం మండల్లోని గిరిజనుల సమస్యలపై కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చైల్డ్ లేబర్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు బషీర్, పలువురు MROలు, MPDOలు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. గిరిజనులకు తాగునీరు, గృహాలు, భూమి, అటవీ హక్కుల పట్టాలు, పాఠశాలలు, రహదారులు, అంగన్వాడీలు, గ్రంథాలయాల వంటి అంశాలపై కలెక్టర్ వారితో చర్చించారు.
News November 5, 2025
శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

నల్గొండ జిల్లాలో కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. జిల్లాలో చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామీ, పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వివిధ ఆలయాలకు భక్తులు ఉదయమే పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయాలు దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
News November 5, 2025
NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.


