News April 28, 2024
4 స్థానాలు.. బరిలో 168 మంది

HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి MP స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114 మంది నామినేషన్ పత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు పరిశీలన కొనసాగింది. సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన శనివారం ఉదయం వరకు కొనసాగింది. పరిశీలన పూర్తయ్యాక నాలుగు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు ఉన్నట్లు తేలిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
Similar News
News November 13, 2025
HYD: గెట్ రెడీ.. రేపే కౌంటింగ్

రేపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్‌పేటలోని 1వ బూత్‌తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్‌తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.
News November 13, 2025
HYD: నేడే ఫీజు చెల్లింపులకు లాస్ట్..!

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.
News November 13, 2025
అధికారికంగా జూబ్లీహిల్స్‌లో 48.49% ఓటింగ్

జూబ్లీహల్స్ బైపోల్ వివరాలు అధికారికంగా వెల్లిడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లలో పురుషులు 2,08,561 మంది ఉండగావారిలో 99,771 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా 94,855 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 25 మంది ఉండగా ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తంగా 1,94,631 మంది ఓటేశారని అధికారికంగా గణాకాంలు ఇవాళ విడుదల అయ్యాయి. 48.49%తో అతి తక్కువ ఓటింగ్ మనవద్దే నమోదు కావడం గమనార్హం.


