News January 2, 2025
4 నెలలే దర్శనం.. ఈ ఆలయ చరిత్ర ఘనం!

సంగమేశ్వర దేవాలయం కర్నూలు <<15042913>>జిల్లాలో<<>> ప్రముఖ పుణ్యక్షేత్రం. ఆత్మకూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణా నదిలో ఈ ఆలయం ఉంది. ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అనే ఏడు నదులు కలుస్తుండటంతో సంగమేశ్వరం అని పిలుస్తారు. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉండగా ఎందరో మునుల తపస్సుకు ఈ ప్రాంతం ఆశ్రయమిచ్చింది.
Similar News
News December 20, 2025
10వ ఫలితాల పెంపునకు 361 పాఠశాలలకు మెంటార్లు: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లాలో 361 పాఠశాలలకు 361 మంది అధికారులను మెంటార్లుగా నియమించినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పటిష్ఠంగా అమలు చేసి ఈ ఏడాది 90శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. డ్రాపౌట్ అయిన 1,559 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావాలన్నారు. హాజరు, రోజువారీ పరీక్షలు, జవాబు పత్రాల పరిశీలనపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.
News December 20, 2025
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యం: డీఐజీ, ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ పరిధుల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై సమావేశాలు నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
News December 20, 2025
కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


