News March 9, 2025
4 రోజుల్లో కూతురి వివాహం.. తండ్రి మృతి

నాలుగు రోజుల్లో కూతురు వివాహం ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. మొండికుంటకు చెందిన రైతు చిన్న వెంకన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుభలేఖలు పంచి ఇంటికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగారు. కాగా ఈ నెల 12న జరగాల్సిన వివాహం వాయిదా పడింది.
Similar News
News March 10, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

✓ సింగరేణి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ✓ఖమ్మం: సేంద్రీయ సాగుపై మంత్రి తుమ్మల సంతృప్తి ✓ వనంవారి కిష్టాపురం వద్ద కారు బోల్తా.. స్వల్ప గాయాలు ✓ కూసుమంచి: సోదరుల మధ్య ఘర్షణ.. అన్న తలకు గాయం ✓ మన ఖమ్మం జిల్లాకు రూ.1,400 కోట్లు ✓ చింతకాని : యువతి అదృశ్యం.. కేసు నమోదు ✓ చింతకాని: లింగనిర్ధారణ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.
News March 9, 2025
ఖమ్మం: శ్రీ చైతన్య క్యాంపస్‌లో అవగాహన సదస్సు

పుట్టకోటలోని శ్రీ చైతన్య గ్లోబల్ క్యాంపస్ నందు ‘ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ -బియాండ్ బౌండరీస్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్రాంత సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ హాజరై AI, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల గురించి వివరించారు. సదస్సులో 2 వేలకు పైగా ప్రముఖులు, తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ మల్లంపాటి శ్రీధర్, ఏజీఎంలు, కోఆర్డినేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
News March 9, 2025
ఖమ్మం: విద్యార్థినికి మెసేజ్‌లు.. లెక్చరర్‌పై పోక్సో కేసు

ఖమ్మం గాంధీ చౌక్ వద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినికి ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్న లెక్చరర్ కె.హరిశంకర్‌పై ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 3టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆయనను IEJD విధుల నుంచి తొలగించారు.