News February 9, 2026
4/800 మార్కులు.. అయినా..

NEET-PG <<18852584>>కటాఫ్<<>>ను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన వారికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు లభిస్తున్నాయి. రోహ్‌తక్‌లోని ఓ కాలేజీలో ఆర్థోపెడిక్స్ సీటు 800కిగానూ 4 మార్కులకు, ఢిల్లీలోని టాప్ కాలేజీలో గైనకాలజీ సీటు 44mrksకు దక్కడం గమనార్హం. ఇంత తక్కువ మెరిట్ ఉన్నా సీట్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Similar News
News February 9, 2026
బాడీ షేమింగ్ చేస్తే శిక్ష పడుతుందని తెలుసా?

వాక్ స్వాతంత్ర్యం అనే పేరుతో చాలామంది జోకులు, వ్యంగ్యంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. అలాంటి వాటిలో బాడీ షేమింగ్ ప్రధానంగా ఉంటుంది. ఇవి బాధితుల్లో మానసిక ఒత్తిడి, ఇబ్బందిని పెంచి.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. అయితే దీని కోసం ప్రత్యేక చట్టాలు లేవు కానీ బాధితులు పరువునష్టం కింద కేసు నమోదు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
News February 9, 2026
మంత్రులకు సీఎం CBN క్లాస్!

AP: రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై రివ్యూ సందర్భంగా CM చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మంత్రులంటే కేవలం పాలసీలు చేసేవాళ్లు కాదు. జనాభా పెరుగుదలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గర్భనిరోధక ఆపరేషన్లు తగ్గించాలి. పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై అసెంబ్లీలో పాలసీ ప్రకటిస్తాం. జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలిస్తాం. APR 1 నుంచి పాలసీ ప్రణాళిక రూపొందిస్తాం’ అని చెప్పినట్లు సమాచారం.
News February 9, 2026
ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం

T20WCలో భాగంగా ఇటలీతో జరిగిన <<19091297>>మ్యాచ్‌లో<<>> స్కాట్లాండ్ 73 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇటలీ 16.4 ఓవర్లలో 134 స్కోరుకే ఆలౌటైంది. బెన్ మనేంటి(52), హ్యారీ మనేంటి(37), జేజే స్మట్స్(22) మినహా అందరూ విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ 4, మార్క్ 2, బ్రాడ్ కుర్రీ, వీల్, ఒలీవర్ తలో వికెట్ తీశారు.


