News January 28, 2025
UKలోని 200 సంస్థల్లో 4 డేస్ వీక్ అమలు

UKలో 5K+ ఉద్యోగులున్న 200 కంపెనీలు 4 డేస్ వీక్ అమలుకు అంగీకరించాయి. వందేళ్ల క్రితం ప్రారంభమైన 9-5, ఐదు రోజుల పని వారం ఇప్పటి కాలానికి అనుగుణంగా లేదని నిపుణులు భావిస్తున్నారు. వారానికి 4 రోజుల పని ఉద్యోగులకు 50% ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుందని, ఇది వారి జీవితాలను సంతోషంగా, సంతృప్తిగా గడపడానికి అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మరోవైపు భారత్లో 70, 90 గంటల పనివేళలపై చర్చ నడుస్తుండడం తెలిసిందే.
Similar News
News March 14, 2025
శుభ ముహూర్తం (14-03-2025)

☛ తిథి: పూర్ణిమ ఉ.11.25 వరకు ☛ నక్షత్రం: ఉత్తర పూర్తిగా
☛ శుభ సమయం: 1.ఉ.10.30-12.00 వరకు
2.సా.4.43-4.55 వరకు
☛ రాహుకాలం: మ.10.30-12.00 వరకు
☛ యమగండం: మ.3.00-4.30 వరకు
☛1.దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.మ.12.24-1.12 వరకు
☛ వర్జ్యం: మ.1.26-3.10 వరకు
☛ అమృత ఘడియలు: రా.3.29-5.13 వరకు
News March 14, 2025
HEADLINES

* TG: డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర: CM రేవంత్
* అసెంబ్లీ స్పీకర్పై వివాదాస్పద వ్యాఖ్యలు.. సభ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెండ్
* కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారు: MLC విజయశాంతి
* మా వల్లే గతంలో కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: CM చంద్రబాబు
* వచ్చే ఏడాది నుంచి FEB చివర్లోనే ఇంటర్ పరీక్షలు: లోకేశ్
* AP, TGలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
News March 14, 2025
WPL: ఫైనల్లో ముంబై

గుజరాత్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. MI ముందుగా బ్యాటింగ్ చేయగా మాథ్యూస్(77), స్కివర్ బ్రంట్(77) విధ్వంసంతో 213 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గిబ్సన్(34)దే అత్యధిక స్కోరు. దీంతో ముంబై ఫైనల్ చేరింది. ఈ నెల 15న ఢిల్లీతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది.