News May 10, 2024

4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో మరో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 12, 13, 14 తేదీల్లో వర్షాలు కురిసే జిల్లాల జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 18, 2025

ఢిల్లీ పేలుడు: హమాస్ తరహా దాడికి ప్లాన్?

image

ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కారు బ్లాస్ట్‌కు ముందు టెర్రరిస్టులు భారీ దాడికి కుట్ర చేసినట్లు NIA దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు, రాకెట్లను తయారు చేసేందుకు యత్నించారని తేలింది. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో అటాక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు సమాచారం.

రెండు రోజులు జాగ్రత్త!

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.