News June 12, 2024
PLI స్కీమ్తో రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: ICRA
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ.4లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రావొచ్చని ICRA వెల్లడించింది. సెమీకండక్టర్, సోలార్, ఫార్మా రంగాల్లో బడా ప్రాజెక్టులు ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ స్కీమ్ కింద వివిధ రంగాల్లో రెండు లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని అంచనా వేసింది. కాగా 2021లో 14 రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు PLI స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.
Similar News
News December 23, 2024
హైకోర్టులో KCR, హరీశ్ క్వాష్ పిటిషన్
TG: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. మేడిగడ్డ నిర్మాణంలో వీరిద్దరూ అవినీతికి పాల్పడ్డారంటూ భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను కొట్టేయాలంటూ KCR, హరీశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
News December 23, 2024
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి
ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత శ్యామ్ బెనగల్(90) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్లో అంకుర్, భూమిక, నిషాంత్, కల్యుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న HYD తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి.
News December 23, 2024
మహిళా సంఘాల ద్వారా RTCకి 150 ఎలక్ట్రిక్ బస్సులు: సీఎస్
TG: రాష్ట్రంలో తొలి విడతలో 5 జిల్లాల్లోని 231 ఎకరాల్లో స్వయం సహాయక బృందాలచే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. 6 నెలల్లో ఆలయ భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి 150 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.