News November 19, 2024
ఏపీలో మరో 4 కార్పొరేషన్లు ఏర్పాటు

AP: యాదవ, గౌడ, మాల, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు వాటికి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున 60 మంది సభ్యులను నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించింది.
Similar News
News February 15, 2026
రెండేళ్లలో 40% నుంచి 6%కి ఓలా మార్కెట్ షేర్

ఒకప్పుడు దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. 2024 జనవరిలో 40%కి దగ్గరగా ఉన్న మార్కెట్ షేర్.. 2026 జనవరి నాటికి 6% కంటే తక్కువకు పడిపోయింది. సర్వీస్ నాణ్యత లోపాలు, పెరుగుతున్న కస్టమర్ కంప్లైంట్స్, ఇతర కంపెనీల నుంచి పోటీతో ఓలా ఐదో స్థానానికి పడిపోయింది. డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.470 కోట్లకు పడిపోయింది.
News February 15, 2026
వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

కొలంబోలో నేడు జరగాల్సిన భారత్-పాక్ హై-వోల్టేజ్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ టైమ్(7pm)కు వర్షం కురిసే ఛాన్స్ 65% వరకు ఉందని వాతావరణ శాఖ అంచనా. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే లేదు. వర్షం వల్ల కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దవుతుంది. అప్పుడు ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఇప్పటికే తలో రెండు విజయాలతో ఉన్న భారత్, పాక్.. 5 పాయింట్లతో నేరుగా సూపర్-8కు చేరుకుంటాయి.
News February 15, 2026
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ముప్పు ఎవరికి ఎక్కువంటే?

* గతంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లలో మరోసారి కూడా వచ్చే అవకాశముంది. * భాగస్వామి నుంచి గనేరియా, క్లమీడియా వంటి లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ముప్పు కనిపించవచ్చు. * సంతాన సాఫల్యత కోసం చికిత్సలు తీసుకుంటున్నవారు. * ఫెలోపియన్ ట్యూబుల్లో లోపాలుండి, వాటిని సరిదిద్దేందుకు శస్త్రచికిత్స తీసుకున్నవారు. * పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ.


