News January 16, 2025

4 కొత్త పథకాలు.. సీఎస్ కీలక ఆదేశాలు

image

TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులను గుర్తించి జాబితాలను ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. GHMCలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

Similar News

News January 16, 2025

చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా: అనిల్ రావిపూడి

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News January 16, 2025

15 నెలల యుద్ధానికి ముగింపు!

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. 2023 అక్టోబర్ 3న ఇజ్రాయెల్‌పై అనూహ్య దాడితో హమాస్ ఈ యుద్ధానికి తెరలేపింది. ఈ దాడిలో 1,200 మందికిపైగా పౌరులను ఇజ్రాయెల్ కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని గాజాలోకి పంపి ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటివరకు 46,000 మందికి పైగా పాలస్తీనీయులు మరణించగా సుమారు లక్ష మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

News January 16, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 16, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.