News September 10, 2024

4 PHOTOS: విలయం తర్వాత విజయవాడ

image

AP: ఇటీవల వచ్చిన భారీ వరదలతో విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు వరద తగ్గిపోవడంతో ఇన్ని రోజులు నీటిలో మునిగిపోయిన వస్తువులు, వాహనాలు బురద పూసుకొని తేలాయి. ఎంతో మంది సామాన్యుల ఇళ్లలోని సామగ్రి, పుస్తకాలు, చిన్న చిన్న షాపుల్లోని వస్తువులు పూర్తిగా పాడైపోయాయి. వరదలు విజయవాడకు ఎంతలా గాయం చేశాయో పై ఫొటోల్లో చూసి అర్థం చేసుకోవచ్చు. PHOTOS – BBC

Similar News

News December 30, 2024

రికార్డు సృష్టించిన ముంబై బాలిక

image

ముంబైకు చెందిన కామ్య కార్తికేయన్(17) రికార్డు సృష్టించారు. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా చరిత్ర లిఖించారు. ఆసియాలో ఎవరెస్ట్, ఆఫ్రికాలో కిలిమంజారో, యూరప్‌లో ఎల్‌బ్రస్, ఆస్ట్రేలియాలో కొసియస్కో, దక్షిణ అమెరికాలో అకాన్‌కగువా, ఉత్తర అమెరికాలో డెనాలీ, అంటార్కిటికాలో విన్సెంట్ పర్వతాల్ని ఆమె అధిరోహించారు. కామ్య ఏడేళ్ల వయసుకే పర్వాతారోహణను ప్రారంభించడం విశేషం.

News December 30, 2024

అమెరికా మాజీ అధ్యక్షుడి కన్నుమూత

image

అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్(100) నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా పలు అనారోగ్యాల్ని ఎదుర్కొంటున్న ఆయన జార్జియాలోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కార్టర్ కుటుంబం తెలిపింది. ఆయన యూఎస్ ప్రెసిడెంట్‌గా 1977-1981 మధ్యకాలంలో పనిచేశారు. అమెరికా అధ్యక్షుల్లో సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా కార్టర్ రికార్డ్ సృష్టించారు. 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

News December 30, 2024

అసెంబ్లీలో భువనేశ్వరిని అన్నప్పుడు ఏమయ్యారు: బుద్దా వెంకన్న

image

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై TDP సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని బియ్యం స్కామ్‌లో స్వయంగా భార్యను ఇరికించారన్నారు. ‘స్కామ్‌లో మీ భార్యను ఇరికించి మీరు తప్పించుకున్నారు. చంద్రబాబుది ఎవర్నీ కించపరిచే మనస్తత్వం కాదు. అలాంటి మనిషి భార్యను అసెంబ్లీలో మీ పార్టీ నేతలు నానా మాటలు అని అవమానించారు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్న మీరు అప్పుడేమయ్యారు?’ అని ప్రశ్నించారు.