News April 14, 2025
కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% కోటా.. తప్పేముందన్న సీఎం

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు పబ్లిక్ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇవాళ PM మోదీ మాట్లాడుతూ ‘టెండర్లలో కాంగ్రెస్ మతాల వారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ SC, ST, OBCల హక్కుల్ని కాలరాస్తోంది’ అని దుయ్యబట్టారు. దీనిపై ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పందిస్తూ ‘ఇందులో తప్పేముంది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డ వారికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News October 22, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 22, 2025
BELలో 47 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) బెంగళూరు 67 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్, BSc(ఇంజినీరింగ్), ME, ఎంటెక్, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.150. SC, ST, PWBDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://bel-india.in/
News October 22, 2025
కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.