News June 9, 2024
టీడీపీకి 4 కేంద్ర మంత్రి పదవులు.. తెరపైకి కొత్త పేర్లు?

AP: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారింది. దీంతో ఆ పార్టీకి కేంద్ర మంత్రి పదవులపై రోజుకొక అంశం తెరపైకి వస్తోంది. మోదీ 3.O కేబినెట్‌లో TDPకి 4 బెర్తులు దక్కొచ్చని NDTV పేర్కొంది. వారిలో రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), హరీశ్(అమలాపురం), దగ్గుమల్ల ప్రసాద్(చిత్తూరు) పేర్లు వినిపిస్తున్నాయని తెలిపింది. ఇవాళ మోదీ ప్రమాణస్వీకారం తర్వాత బెర్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
Similar News
News September 10, 2025
రెస్టారెంట్లో కుళ్లిన ఆహారం, ఎలుకల మలం!

హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో తినేవారికి అలర్ట్. నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ రెస్టారెంట్ అబ్సల్యూట్ బార్బెక్యూకు చెందిన 10 బ్రాంచుల్లో రైడ్స్ చేయగా కిచెన్ ర్యాక్స్‌లో ఎలుకల మలం దర్శనమిచ్చింది. మురికి పాత్రలు, అపరిశుభ్రంగా ఫ్రిడ్జ్‌లు, బొద్దింకలు, ఎక్స్‌పైరీ ఆహారం, కుల్లిపోయిన పండ్లను గుర్తించారు. నోటీసులిచ్చి చర్యలకు సిద్ధమయ్యారు.
SHARE IT
News September 10, 2025
మరోసారి భారత్, చైనాలపై ట్రంప్ అక్కసు

భారత్‌తో మళ్లీ <<17663735>>స్నేహం<<>> కోరుకుంటూనే ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత్, చైనాలపై 100% టారిఫ్స్ విధించాలని యూరోపియన్ యూనియన్‌ను కోరినట్లు సమాచారం. US, EU అధికారుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చ జరిగింది. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ INDపై 50%, చైనాపై 30% టారిఫ్స్ విధించారు.
News September 10, 2025
ట్రంప్‌తో మాట్లాడేందుకు నేనూ ఎదురుచూస్తున్నా: PM మోదీ

తనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్న <<17663735>>ట్రంప్<<>> వ్యాఖ్యలకు PM మోదీ బదులిచ్చారు. తానూ ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన IND, US మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయని, IND-US భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు.