News January 26, 2025
4 పథకాల కోసం ఒక గ్రామం ఎంపిక : ఖమ్మం కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 పథకాల అమలు కోసం ప్రభుత్వ ఆదేశాలనుసారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 100% అర్హులైన వారికి పథకాలు అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదన్నారు.
Similar News
News January 27, 2025
ఏసీబీకి చిక్కిన సత్తుపల్లి మున్సిపల్ వార్డు ఆఫీసర్
సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుదారుడి నుంచి రూ.2,500 లంచం తీసుకుంటూ 23వ వార్డ్ ఆఫీసర్ ఎన్.వినోద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టణంలోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 27, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,800 జెండా పాట పలుకగా, క్వింటా పత్తి ధర రూ.7,225 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే ఇవాళ కొత్త మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి మాత్రం రూ.75 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.
News January 27, 2025
వైరా: పంట కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి
వైరా మండలం గౌండ్లపాలెం సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్ అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.