News February 2, 2025
40 మంది బాల కార్మికులకు విముక్తి: భద్రాద్రి ఎస్పీ

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ స్మైల్ -XI కార్యక్రమాన్ని చేపట్టిందని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News November 6, 2025
ఇజ్రాయెల్లో JOBS.. రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు

ఇజ్రాయెల్ దేశంలో సెరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్ వర్క్, బ్లాక్ బిల్డర్స్(మేసన్స్), జిప్సం వర్క్, ఉద్యోగాల కోసం రేపు నిజామాబాదులో ఎన్రోల్మెంట్, అవగాహనా డ్రైవ్ను నిర్వహించనున్నారు. 21 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి, 10వ తరగతి పాసైనవారు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు కోరారు. VENUE- జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్. CONTACT- 9959456793.
News November 6, 2025
భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

క్వీన్స్లాండ్లో జరుగుతున్న నాలుగో T20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, గిల్, సూర్య (C), తిలక్, అక్షర్, సుందర్, జితేశ్ శర్మ, దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, మ్యాక్స్వెల్, డ్వార్షియస్, బార్ట్లెట్, ఇల్లిస్, జంపా.
News November 6, 2025
మరిపెడ: ACBకి చిక్కిన AEO

మరిపెడ మండల కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిలికుర్తి గ్రామానికి చెందిన రైతు నుంచి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) గాడిపెల్లి సందీప్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


