News September 21, 2025
40 గుడుంబా కేసులు నమోదు: MNCL CI

మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా అరికట్టేందుకు ఈ నెల 30 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు సీఐ గురవయ్య తెలిపారు. గత నవంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన స్పెషల్ తనిఖీల్లో మొత్తం 40 గుడుంబా కేసులు నమోదు చేసినట్లు సీఐ గురువయ్య తెలిపారు. 38 మందిని పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. 44 మందిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
BCCI కొత్త అధ్యక్షుడు ఇతడేనా?

జమ్మూకశ్మీర్‌కు చెందిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ముందున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. రోజర్ బిన్నీ తర్వాత ఇతడికే పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మిథున్ 9వేలకు పైగా రన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. IPL(2008-14)లో ఆడిన తొలి J&K ప్లేయర్‌గా నిలిచారు.
News September 21, 2025
VJA: భక్తులతో ‘ఫోన్ ఇన్’లో దుర్గగుడి EO ఏమన్నారంటే.?

దసరా నేపథ్యంలో భక్తులతో ‘ఫోన్ ఇన్’లో వచ్చిన పలు అంశాలపై EO శీనా నాయక్ ఏర్పాట్ల గురించి వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు మధ్యాహ్నం 3-4 మధ్య సీతమ్మవారి పాదాల వద్దకు వస్తే ప్రత్యేక వాహనాలలో కొండపైకి తరలించి సులభంగా దర్శనం కల్పిస్తామన్నారు. ఉత్సవాలలో భక్తులకు లిఫ్ట్‌లు వాడొద్దని పోలీసుల సూచన మేరకు అందరికీ ఘాట్ రోడ్డు మీదుగానే దర్శనం కల్పిస్తామని EO చెప్పారు.
News September 21, 2025
దుబాయిలో కామారెడ్డి జిల్లా వాసి మృతి

బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన గొడుగు సుధాకర్(38) దుబాయ్‌లో ప్రమాదవశాత్తు కాలుజారి భవనంపై నుండి పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన సుధాకర్ శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని భవనంపై నుంచి కిందికి వస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.