News November 18, 2024
‘40% కమీషన్’ ఆరోపణలు: BJPకి లోకాయుక్తలో రిలీఫ్

కర్ణాటకలో గత BJP సర్కారు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు 40% కమీషన్లు తీసుకున్నట్టు ఆధారాలేమీ లేవని లోకాయుక్త వెల్లడించింది. BBMPలో కాంట్రాక్టులు పొందేందుకు కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని టీవీల్లో పేర్కొన్న అంబికాపతికి ఐదేళ్లపాటు 2022 వరకు అసలు కాంట్రాక్టులే రాలేదంది. 2023, NOV 27న ఆయన చనిపోయారని, ఆయన కొడుకూ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్పై BJP విమర్శలకు దిగింది.
Similar News
News September 16, 2025
డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
News September 16, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
News September 15, 2025
DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.