News April 13, 2025

సన్నబియ్యంలో 40 శాతం నూకలే: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పేరిట 40 శాతం నూకలే పంపిణీ చేస్తోందని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. సన్నబియ్యం పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గురుకులాలకు నూకలు లేని సన్నబియ్యం ఇచ్చామని తెలిపారు. అర్హులైన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా మారిందని, జాకీలు పెట్టి లేపినా లేచే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు.

Similar News

News April 8, 2026

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఈ చిన్న టిప్స్‌తో ఆరోగ్యం మీ సొంతం!

image

రోజంతా కూర్చొనే పనిచేస్తున్నారా? దీనివల్ల ఒబెసిటీ, షుగర్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి 2 నిమిషాలు నడవండి. ఫోన్ మాట్లాడేటప్పుడు నిలబడటం, లిఫ్ట్ బదులు మెట్లు వాడటం వంటి చిన్న మార్పులు చేయండి. కూర్చున్నప్పుడు వీపు నిటారుగా ఉంచి స్క్రీన్‌ను కంటిచూపు లెవల్‌లో పెట్టుకోండి. పోషకాహారం తింటూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటే పనిలో ఉత్సాహం పెరగడమే కాకుండా ఆరోగ్యమూ బాగుంటుంది.

News April 8, 2026

కాఫీ తోటలో పనిచేశా: ఆనంద్ మహీంద్రా

image

కాఫీతో తనకున్న అనుబంధాన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. కర్ణాటకలోని కొడగులో తమ కుటుంబానికి కాఫీ తోటలున్నాయని, సెలవుల్లో అక్కడ పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టానన్నారు. అయితే తన మూలాలు మాత్రం కొడగు కాఫీతోనే ఉన్నాయని స్పష్టం చేశారు. అరకు బదులు ఇతర రాష్ట్రాల కాఫీని ప్రమోట్ చేయాలన్న ఓ నెటిజన్ ట్వీట్‌కు ఆనంద్ ఇలా బదులిచ్చారు.

News April 8, 2026

కాళేశ్వరం, దేవాదుల మోటార్లు పాడయ్యేలా కుట్ర: హరీశ్

image

TG: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదేపదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతోందని, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఉత్తమ్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు.