News March 21, 2024

40 శాతం సంపద.. ఒక శాతం మంది వద్దే!

image

దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. 40.1 శాతం దేశ సంపద, 22.6 శాతం ఆదాయం ఒక శాతం మంది వద్దే ఉందని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచే అసమానతలు పెరుగుతున్నప్పటికీ.. 2014-15 నుంచి 2022-23 మధ్య అధికమైనట్లు పేర్కొంది. అత్యంత సంపద కలిగిన కుటుంబాలకు 2 శాతం సూపర్ ట్యాక్స్ విధిస్తే.. దేశానికి 0.5 శాతం అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

Similar News

News October 28, 2025

సేంద్రియ మల్చింగ్ – ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

సేంద్రియ మల్చింగ్ మొక్క మొదళ్లకు మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా వేస్తే మొక్క కాండానికి హాని కలగదు. ఈ మల్చింగ్ ఎక్కువ దళసరిగా వేస్తే మొక్కకు నీరు, గాలి లభ్యత తగ్గిపోతుంది. ఇవి ఎక్కువ తడిస్తే చిన్న చిన్న క్రిములు, శిలీంధ్రాలు రావచ్చు. కాబట్టి, సేంద్రియ మల్చులను ఎండేలాగా తిప్పి గాలి అందే విధంగా చూసుకోవాలి. శీతాకాలం ముందు మల్చులు వేసుకుంటే మొక్క వేర్లకు, నేలకు చలి వల్ల కలిగే నష్టం తగ్గించుకోవచ్చు.

News October 28, 2025

20 రోజుల్లోనే జుట్టు పెరుగుదల.. గుడ్‌న్యూస్ చెప్పిన చైనా

image

బట్టతల సమస్య యువతను కలవరపెడుతోంది. చాలామందికి యుక్తవయసులోనే బట్టతల వచ్చేస్తోంది. అలాంటి వారికి నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పరిశోధనలో సహజమైన కొవ్వు ఆమ్లాలతో తయారైన సీరం 20 రోజుల్లో జుట్టును పునరుద్ధరించిందని తెలిపారు. ఇది నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్ల మూల కణాలను మేల్కొల్పుతుంది. ఎలుకలతో పాటు ఓ ప్రొఫెసర్ కాలుపై ప్రయోగించగా అది సానుకూల ఫలితాలు ఇచ్చింది.

News October 28, 2025

కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

image

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.