News January 8, 2025

40 ఏళ్ల అనుభవం.. చివరికి ఇస్రో ఛైర్మన్‌గా..

image

ఇస్రో కొత్త <<15093696>>ఛైర్మన్‌గా<<>> నియమితులైన వి.నారాయణన్ ప్రస్తుతం సంస్థలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్(LPSC) డైరెక్టర్‌గా ఉన్నారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన 40 ఏళ్లుగా పలు కీలక స్థానాల్లో పనిచేశారు. నారాయణన్ సారథ్యంలోనే GSLV Mk-3 ద్వారా C25 క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది. అలాగే చంద్రయాన్-2, 3, ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ మిషన్లకు నారాయణన్ నాయకత్వంలోని బృందమే ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను రూపొందించింది.

Similar News

News August 27, 2025

ఇందిరమ్మ ఇళ్లకు రూ.1,000 కోట్లు చెల్లింపు: అధికారులు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,000 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 2.04 లక్షల ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. గత 3 నెలలుగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు నిర్ణీత స్థాయికి వచ్చిన 15 రోజుల్లోపే బిల్లులు రిలీజ్ అయ్యేలా చూస్తున్నామని పేర్కొన్నారు.

News August 27, 2025

బార్ అంటేనే బేర్‌మంటున్నారు!

image

APలో బార్‌ల నిర్వహణకు వ్యాపారులు ముఖం చాటేస్తున్నారు. నిన్నటివరకు 80% బార్‌లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇందుకు కొత్త బార్ పాలసీ నిబంధనలే కారణమని తెలుస్తోంది. రూ.99కి లభించే క్వార్టర్‌ను బార్‌లలో అమ్మేందుకు అనుమతి ఇవ్వకపోవడం, మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడం బార్లకు పెద్ద దెబ్బ అని వ్యాపారులు భావిస్తున్నారు. దీంతో బార్‌ల లైసెన్స్ గడువును ఎక్సైజ్ శాఖ <<17524953>>పొడిగించింది<<>>.

News August 27, 2025

399 వంటకాలతో ‘ఓనం సద్య’.. ఏమేం ఉన్నాయంటే?

image

కేరళలో ఓనం పండుగకు ఓ కాలేజీ విద్యార్థులు 399 వంటకాలతో ‘ఓనం సద్య’ ఏర్పాటు చేశారు. 399 వంటకాల్లో 83 రకాల తోరన్ (కొబ్బరితో తయారుచేసిన ఫుడ్), 64 రకాల స్వీట్లు, 58 రకాల చమ్మతి, 57 రకాల పచ్చళ్లు, 56 రకాల పాయసాలు, 19 రకాల ఫ్రైడ్ వెజిటబుల్స్, నెయ్యి, సాల్ట్, సీడ్స్‌తో చేసిన వెరైటీలు ఉన్నాయి. వీటిని 204 మంది విద్యార్థులు, 11 మంది టీచర్లు తయారుచేయగా గిన్నిస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.