News April 5, 2025

400 ఎకరాల్లోకి ప్రవేశిస్తే చర్యలే..!: DCP

image

రాష్ట్రాన్ని కదిలించిన కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూవివాదంపై HYD మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కఠినంగా అమలవుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు 400 ఎకరాల భూమిలో సంబంధిత పనులు కోసం ప్రవేశం నిషేధించినట్లు పేర్కొన్నారు. అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News October 25, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు

image

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27,28,29 తేదీల్లో హాలిడే ఇచ్చారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27,28న సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా మరికొన్ని జిల్లాల్లోనూ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది.

News October 25, 2025

GWL: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌లో పొరపాటు ఉండొద్దు

image

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2002 ఎలక్టోరల్ జాబితాలో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు. వీసీలో కలెక్టర్ సంతోష్, ఆర్డీఓ అలివేలు, తహశీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

News October 25, 2025

పార్వతీపురం: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08963 796085 నంబర్‌కి ఫోన్ చేస్తే, వెంటనే సహాయక చర్యలు చేపడతామన్నారు.