News April 29, 2024
‘400 పార్..’ పరివార్‌కే ఇష్టం లేదు: సంజయ్

ఈసారి 400 సీట్లు సాధిస్తామన్న BJP ధీమాపై విశ్లేషకుడు సంజయ్ బారు స్పందన ఆసక్తికరంగా మారింది. 400సీట్లు రావడం చాలామంది BJP సీనియర్లకు ఇష్టం లేదని తన వ్యాసంలో పేర్కొన్నారు. గతంలో ఇలా జరిగినప్పుడు అనుభవజ్ఞులను ఇందిర, రాజీవ్ పట్టించుకోనట్లే తమను మోదీ పక్కనబెడితే? అని వారు భయపడుతున్నట్లు తెలిపారు. సంపూర్ణ మెజార్టీ లేకున్నా సమర్థంగా పనిచేయొచ్చని గత సంకీర్ణ ప్రభుత్వాల ప్రోగ్రెస్ కార్డులను ఉదహరిస్తున్నారట.
Similar News
News December 2, 2025
ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.
News December 2, 2025
సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.
News December 2, 2025
‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.


