News April 5, 2025
400 ఎకరాల్లోకి ప్రవేశిస్తే చర్యలే..!: DCP

రాష్ట్రాన్ని కదిలించిన కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూవివాదంపై HYD మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కఠినంగా అమలవుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు 400 ఎకరాల భూమిలో సంబంధిత పనులు కోసం ప్రవేశం నిషేధించినట్లు పేర్కొన్నారు. అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News April 6, 2025
కాంగ్రెస్, BRS పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది BJPయేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. HYDలో BJP ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అవినీతి పాలన, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, KCR కుటుంబ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. INC, BRS పార్టీల కుట్రలు, నిజస్వరూపాన్ని బయటపెట్టి BJPని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
News April 6, 2025
మార్కెట్ క్రాష్‌ను జయించిన వృద్ధుడి చాతుర్యం

టారిఫ్స్ ఎఫెక్ట్‌తో స్టాక్‌మార్కెట్స్ క్రాష్ అయి మస్క్, బెజోస్, బిల్‌గేట్స్ తదితర కుబేరులు రూ.కోట్ల సంపద కోల్పోయారు. అయితే టాప్10 బిలియనీర్ల జాబితాలో 94 ఏళ్ల వారెన్ బఫెట్ మాత్రమే $12.7B లాభాలతో మార్కెట్ పతనాన్ని జయించారు. కన్జూమర్ గూడ్స్, ఎనర్జీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్లలో ట్రేడింగ్‌తో పాటు ఈక్విటీ షేర్స్ అమ్మేసి షార్ట్ టర్మ్ US ట్రెజరీ బిల్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆయన సక్సెస్ సీక్రెట్స్.
News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.