News May 12, 2024

ఆస్కార్ శతాబ్ది వేడుకలకు రూ.4,000 కోట్లు

image

సినీ ప్రపంచంలో ప్రఖ్యాత పురస్కారంగా భావించే ‘ఆస్కార్’ శతాబ్ది వేడుకలకు నిర్వాహకులు సన్నాహాలు మొదలుపెట్టారు. 2028లో జరిగే ఈ కార్యక్రమం కోసం 500 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,000 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. ఈ వేడుకల్లోనే మరో వందేళ్లు ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. 97వ ఆస్కార్ వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్నాయి.

Similar News

News October 21, 2025

ఆయన భారత్‌ను ఎంచుకున్నారు.. లోకేశ్ ట్వీట్ వైరల్!

image

AP: వైజాగ్‌లో $15B పెట్టుబడులతో గూగుల్ డేటా-Ai హబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులో అధికార DMK, ప్రతిపక్ష AIADMK మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గూగుల్‌ను TNకు తీసుకురావడంలో CM స్టాలిన్ ఫెయిలయ్యారని, తమిళుడైన గూగుల్ CEO పిచయ్ APని ఎంచుకున్నారని AIADMK చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఆయన భారత్‌ను ఎంచుకున్నారు’ అంటూ హుందాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.

News October 21, 2025

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తున్నారా?.. జాగ్రత్త!

image

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే తిప్పలు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ దాటితే IT శాఖ నుంచి నోటీసులొస్తాయని, భారీ ఫైన్లు విధిస్తారని చెబుతున్నారు. ‘₹20 వేలకు మించి నగదును రుణంగా ఇవ్వకూడదు/తీసుకోకూడదు. ఒకేరోజు ₹2 లక్షలు/అంతకంటే ఎక్కువ నగదు తీసుకోడానికి పర్మిషన్ లేదు. వీటిపై 100% పెనాల్టీ విధించే చాన్స్ ఉంది’ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుందంటున్నారు.

News October 21, 2025

కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

image

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.