News February 19, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4,000 ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా 4,000 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న వర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు అర్హులు. మూడు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://www.bankofbaroda.in/సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News January 30, 2026
భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.
News January 30, 2026
మామునూరు విమానాశ్రయం.. కేంద్రానికి 300 ఎకరాలు అప్పగింత

TG: WGL మామునూరు విమానాశ్రయం కోసం సేకరించిన 300 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. బేగంపేట్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి Dy.CM భట్టి విక్రమార్క డాక్యుమెంట్లను అందజేశారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రామ్మోహన్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి 2.5ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
News January 30, 2026
వరాహ స్వామి, వారాహి దేవి.. ఇద్దరూ ఒకరేనా?

ఇద్దరూ ఒకరు కాదు. కానీ ఒకే తత్వానికి చెందినవారు. వరాహ స్వామి దశావతార రూపం. వారాహి దేవి మాత్రం వరాహమూర్తి నుంచి ఉద్భవించిన ఆయన అంశ. సప్తమాతృకలలో ఒకరైన వారాహి దేవి, వరాహ స్వామి ముఖాన్ని పోలి ఉండి, రాక్షస సంహారంలో శక్తిగా తోడ్పడింది. వరాహ స్వామి రక్షకుడు అయితే, వారాహి దేవి ఆ స్వామి కార్యనిర్వాహక శక్తి. అయితే వరాహ అవతారానికి పూర్వమే, వారాహి దేవి ఉనికి ఉందని ఇంకొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.


