News May 3, 2024

పల్సర్ నుంచి 400cc బైక్

image

బజాజ్ కంపెనీ సరికొత్త పల్సర్ బైక్‌తో ముందుకొచ్చింది. 400cc ఇంజిన్, 40Hp పవర్‌తో NS400Z అనే కొత్త బైకును మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6 గేర్ బాక్స్, డ్యూయల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, LED హెడ్ ల్యాంప్, బ్లూటూత్, టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ స్పీడ్ 154km/h అని బజాజ్ పేర్కొంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది.

Similar News

News December 26, 2024

బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

image

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.

News December 26, 2024

సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.

News December 26, 2024

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో దిల్ రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.