News April 20, 2025
40,132 మందికి గ్యాస్ సబ్సిడీ విడుదల: జేసీ

రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని 40,132 మంది లబ్దిదారులకు విడుదల చేశామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వారిలో 26,651 లబ్దిదారులకు రూ.2,11,06,884 బ్యాంకు అకౌంట్లలో జమైందన్నారు. మిగతావారికి త్వరలో సబ్సిడీ మొత్తం జమవుతుందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని హెచ్చరించారు.
Similar News
News April 20, 2025
చందనోత్సవానికి 500 కేజీల చందనం చెక్కలు సిద్ధం

ఏప్రిల్ 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఈనెల 24న మొదటి విడత చందనం అరగదీతను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం కావాల్సిన 500 కేజీల చందనపు చెక్కలను ఆదివారం సిద్ధం చేశారు. ఈనెల 24 ఉదయం 6:30కు చందనం అరగదీత మొదలవుతుందని, 7:30 తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.
News April 20, 2025
కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు నిరూపించాలి: V.M.R.D.A ఛైర్మన్

G.V.M.C.ఎన్నికల్లో కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు దాన్ని నిరూపించాలని V.M.R.D.A ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాల్ చేశారు. అవిశ్వాసంలో ధర్మబద్ధంగా నెగ్గామన్నారు. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేయని అరాచకం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇకపై జీవీఎంసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు.
News April 20, 2025
DSC: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.