News September 30, 2025

41 మంది మృతి.. పరామర్శ లేదు, వివరణ లేదు!

image

కరూర్ తొక్కిసలాట ఘటనతో TVK చీఫ్ విజయ్ ఇంకా రాజకీయ పరిణతి సాధించనట్లు స్పష్టమవుతోంది. దుర్ఘటనలో 41 మంది చనిపోయినా, 50 మందికి పైగా గాయపడ్డా బాధిత కుటుంబసభ్యులను ఇప్పటివరకు పరామర్శించలేదు. కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. ‘ఆ ఘటనతో నా గుండె పగిలింది’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే చేశారు. మరోవైపు విజయ్ పరిహారం ప్రకటించారని, ప్రస్తుతం ఆయన షాక్‌లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.

Similar News

News January 23, 2026

Q3 ఫలితాల ఎఫెక్ట్.. 4 శాతం తగ్గిన ఇండిగో షేర్

image

దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు డిసెంబరు త్రైమాసికంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం ఏకంగా 78% పడిపోయి రూ.549.1 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,448.8 కోట్ల లాభం నమోదు కావడం గమనార్హం. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు, కొత్త కార్మిక చట్టాల అమలే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. Q3 ఫలితాల ప్రభావంతో ఇండిగో షేర్ మార్కెట్లో దాదాపు 4% పడిపోయింది.

News January 23, 2026

364 పోస్టులకు నోటిఫికేషన్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in

News January 23, 2026

KTR విచారణ.. BRS విరాళాలపై సిట్ ఆరా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 4 గంటలుగా కొనసాగుతోంది. ఓ ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు వచ్చిన విరాళాలపైనా సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని రూ.కోట్లు వచ్చాయనే వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.