News August 30, 2025

పరీక్ష లేకుండా 412 ఉద్యోగాలు.. నోటిఫికేషన్

image

HYDలోని ఈసీఐఎల్‌లో 412 ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. SEP 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ తదితర 13 విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. 18-25ఏళ్ల వయసు ఉండి, టెన్త్‌తోపాటు సంబంధిత ITI ట్రేడులో NCVT సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. విద్యార్హతల్లో మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/

Similar News

News January 25, 2026

యాలకులతో ఆరోగ్య ప్రయోజనాలు

image

యాలకుల్లో ఉండే జింక్, ఐరన్, విటమిన్ సి, రిబోఫ్లావిన్, సల్ఫర్, నియాసిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇవి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, కడుపునొప్పి, అసిడిటీ వంటి సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన పోతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాసకోశ సమస్యలు పోతాయి. వీటిలోని ఎంజైమ్‌లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి’ అని అంటున్నారు.

News January 25, 2026

ఈ రథసప్తమి చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?

image

ఈ ఏడాది రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది. సూర్యుడికి ఆదివారం అంటే మహా ప్రీతి. అదే రోజున ఆయన జన్మదినం రావడం ఈ పర్వదినాన రెట్టింపు శక్తినిస్తుంది. దీన్ని భాను సప్తమి అని కూడా అంటారు. ఈరోజు చేసే సూర్యారాధన, ధ్యానం, దానధర్మాలు కోటి రెట్లు ఫలితాన్నిస్తాయి. ఇలాంటి అరుదైన యోగం ఉన్న రోజున అరుణోదయ స్నానమాచరించి, సూర్యుడిని దర్శించుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగి ఐశ్వర్యం, ఆయుష్షు సిద్ధిస్తాయని నమ్మకం.

News January 25, 2026

మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ లిస్టులో మరో 14 కులాలు

image

TG: మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (MBC) లిస్టులో మరో 14 కులాలను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో కేంద్రానికి లేఖ రాయనుంది. ప్రస్తుతం MBC లిస్టులో 36 కులాలు ఉండగా, ఆ సంఖ్య 50కి చేరనుంది.
14 కులాలు: దాసరి(బెగ్గరి), జంగం, పంబాల, వాల్మికి బోయ, తల్యారీ, చుండువాళ్లు, యాట, సిద్దుల, సిక్లింగర్, ఫకీర్, గుడ్డి ఏలుగు, కునపులి, రాజనాల, బుక్క అయ్యవారాస్.