News February 13, 2025

42 మంది నెల్లూరు కార్పొరేటర్లకు నోటీసులు

image

ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో 42 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. అయితే 42 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వారికి నోటీసులు జారీ చేశారు. జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన కరిముల్లాకు కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థికి 40 ఓట్లు వేయగా, ఇద్దరు ఓటింగుకు పాల్గొనలేదు.

Similar News

News October 27, 2025

భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే.!

image

☞ నెల్లూరు కలెక్టరేట్: 0861 2331261, 7995576699
☞ కందుకూరు సబ్‌ కలెక్టరేట్: 7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు: 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు: 9100948215
☞ కావలి RDO ఆఫీసు: 7702267559
☞ ఆయా పరిధిలోని ప్రజలు ఇబ్బందులు ఉంటే ఈ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.

News October 27, 2025

నెల్లూరు: రేపు కూడా స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీలకు సెలవును మరో రోజు పొడిగిస్తున్నట్లు నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లతోపాటు అంగన్వాడీలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం సైతం తుఫాన్ ప్రభావం ఉండనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 27, 2025

మొంథా ఎఫెక్ట్.. నెల్లూరుకు రూ.కోటి నిధులు

image

మొంథా తుపాన్‌ను ఎదుర్కునేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.