News September 12, 2024

42 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం

image

ప.గో.జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 42.86 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ జిల్లా అధికారి దేవానందకుమార్ బుధవారం తెలిపారు. నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలాల్లో 2,862 మంది రైతులకు చెందిన కూరగాయల తోటలు దెబ్బతిన్నాయన్నారు. యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాల్లో 50 హెక్టార్లలో అరటి తోటలు మునిగిపోవడంతో పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

Similar News

News October 24, 2025

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

image

రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. నర్సాపురం-కోటిపల్లి, నర్సాపురం-మచిలీపట్నం పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ చేయాలన్నారు. నరసాపురం-వారణాసి కొత్త రైలుకు కీలక ప్రతిపాదన, వందే భారత్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలన్నారు.

News October 24, 2025

స్కూల్ పైనుంచి పడిన విద్యార్థిని పరిస్థితి విషమం

image

తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణా దేవి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కొమ్ము హాసిని బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని తండ్రి రవికుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.

News October 24, 2025

తణుకు: నాగుల చవితికి తేగలు సిద్ధం

image

నాగులచవితి పురస్కరించుకొని మార్కెట్లో తేగలు అందుబాటులోకి వచ్చాయి. సహజసిద్ధంగా దొరికే తేగలు, బుర్ర గుంజు నాగులచవితి రోజున పుట్టలో వేస్తుంటారు. అప్పటినుంచి తేగలు తినడానికి మంచి రోజుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విరివిగా దొరికే తేగలను మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నాగుల చవితి రోజున వినియోగించడానికి ఒక్కో తేగను తణుకులో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.