News February 13, 2025
42 మంది నెల్లూరు కార్పొరేటర్లకు నోటీసులు
ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో 42 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. అయితే 42 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వారికి నోటీసులు జారీ చేశారు. జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన కరిముల్లాకు కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థికి 40 ఓట్లు వేయగా, ఇద్దరు ఓటింగుకు పాల్గొనలేదు.
Similar News
News February 13, 2025
నెల్లూరు: ప్రేమ పేరుతో లైంగిక దాడి
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడి చేసిన ఘటన వెంకటాచలం మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం..కసుమూరుకు చెందిన మస్తాన్‌బాబు ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఓ యువతి నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనేకసార్లు లైంగికంగా వేధించాడని అన్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా ఒప్పుకోకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
నెల్లూరు: రోళ్లపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
V.V.పాలెం మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. 167B హైవే సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి బైకును ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మయ్య(60)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 12, 2025
కావలి మనీ స్కాం వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
కావలి కేంద్రంగా స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన భారీ మనీ స్కాం వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుల్ పాత్ర ఉండటంతో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదేశాలు జారీ చేశారు. మనీ స్కాంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ అనంతరం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణ, జ్యోతి అయోధ్య కుమార్ లను సస్పెండ్ చేశారు.